శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (16:20 IST)

అంగన్ వాడీ పిల్లలను నారాయణ విద్యాసంస్థలకు అప్పగిస్తున్నారా?!

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఐసీడీఎస్‌ ప్రాజెక్టు నిర్వీర్యం కానుందా..? మోడల్‌ అంగన్‌వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు కానున్నాయా..? చిరుద్యోగుల బతుకులు వీధిన పడనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంద

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఐసీడీఎస్‌ ప్రాజెక్టు నిర్వీర్యం కానుందా..? మోడల్‌ అంగన్‌వాడీల పేరిట పలు సెంటర్లు రద్దు కానున్నాయా..? చిరుద్యోగుల బతుకులు వీధిన పడనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. ఇంగ్లిష్‌ బోధన అంటూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ జపం చేస్తూ.. నారాయణ మంత్రాన్ని పఠించడం పలు విమర్శలకు తావిస్తోంది.  
 
ప్రాథమిక విద్య మొదులుకుని ఉన్నత విద్య వరకు కార్పోరేట్ కబంద హస్తాల్లో చిక్కుకున్న సమయంలో అంగన్‌వాడి సెంటర్లను కూడా ఆ దిశగా నడిపించే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. చిన్నపిల్లల ఆలనాపాలనా చూస్తూ పౌష్టికాహారన్నిఅందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిని అంగన్‌వాడి సెంటర్లు ప్రి-ప్రైమరీ స్కూల్స్‌గా మారనున్నాయి. ఐసీడీఎస్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇకపై నారాయణ మంత్రం జపించబోతున్నారు.
 
మోడల్‌ అంగన్‌వాడీ సెంటర్ల పేరిట ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని పలు ప్రాజెక్టులను ఎంపికచేసింది. అంగన్‌ వాడీ సెంటర్లను పూర్తిస్థాయి ఇంగ్లిష్‌ కాన్వెంట్లుగా మార్చే కార్యక్రమం అంటూ మభ్యపెడుతోంది. ఇందుకోసం మూడేసి అంగన్‌వాడీ కేంద్రాలను ఒకటిగా కలిపి మోడల్‌ కాన్వెంట్లుగా తయారుచేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లకు నారాయణ విద్యాసంస్థలకు చెందిన టీచర్లతో శిక్షణ ఇస్తున్నారు.
 
చిత్తూరు జిల్లాలో ఒక్క పలమనేరు ఐసీడీఎస్‌ పరిధిలో 335 అంగన్‌వాడీ సెంటర్లున్నాయి. ఇందులో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 6,179 మంది ఉన్నారు. పలమనేరు మున్సిపాలిటీలో 8, మండల కేంద్రాల్లో కొన్నింటిని కలిపి మొత్తం 20 సెంటర్లను మోడల్‌ అంగన్‌వాడీలుగా ఎంపిక చేశారు. దీనికోసం ఇన్నాళ్లూ సాఫీగా కొనసాగుతున్న 20 సెంటర్లను రద్దుచేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఏరియాల్లో అన్ని సెంటర్లు, మండలానికి రెండు కేంద్రాలను మోడల్‌ అంగన్‌వాడీలుగా మార్చారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో 120 కేంద్రాలను మూడింటికి ఒకటి చొప్పున 40కి కుదించారు. 60 మండలాల్లో రెండేసి చొప్పున 120 సెంటర్లను 40కి తగ్గించారు. మొత్తం జిల్లాలో 80 అంగన్‌వాడీలను మోడల్‌ అంగన్‌వాడీలుగా మార్చారు. ఈ నేపథ్యంలో 160 సెంటర్లు మూతబడినట్టే. 
 
రద్దు చేసిన వర్కర్లు మోడల్‌ సెంటర్లలో పనిచేసేలా ఆదేశాలిచ్చారు. ఒక్కో సెంటర్‌లో ముగ్గురు వర్కర్లు మూడు తరగతులు బోధించాలి.  అంగన్‌వాడీ వర్కర్లకు ఈమధ్యనే నారాయణ స్కూల్‌లో బోధనపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అంగన్‌వాడీ పిల్లలను 3 నుంచి 3.7 నెలల వయసు దాకా నర్సరీ, 3.8 నెలల నుంచి 4.8 నెలల దాకా ఎల్‌కేజీ, 4.9 నెలల నుంచి 5.8 నెలల దాకా యూకేజీగా జాబితాను తయారుచేశారు. ఈ పిల్లలకు నారాయణ పాఠశాలలో ఏదైతే సిలబస్‌ ఉందో అదే పుస్తకాలను పంపిణీ చేశారు. త్వరలో ఈ మోడల్‌ అంగన్‌వాడీలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఎంపిక చేసిన ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. 
 
మామూలుగా ఐసీడీఎస్‌ ద్వారా పిల్లలకు బోధన బాగానే ఉంది. ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించి తద్వారా పాఠాలు చెబుతున్నారు. బోధన కోసం బొమ్మలను కూడా ప్రభుత్వం అన్ని సెంటర్లకు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఉన్న బోధనా పరికరాలు, పుస్తకాలు ఇక మీదట వృధా కావాల్సిందే. పదో తరగతి చదువుకున్న అంగన్‌వాడీలు ఇంగ్లీషు మీడియంలో బోధనకు పదిరోజులు శిక్షణ తీసుకున్నంత మాత్రాన కార్పొరేట్‌ శైలిలో కాన్వెంట్‌ పాఠాలు చెప్పడం కుదిరే పనేనా అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థలకు అంగన్‌వాడీ పిల్లలను ప్రమోట్‌ చేసేందుకు ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.