సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (11:12 IST)

15వ తేదీ నుంచి ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో రాజకీయంగా హీటెక్కుతున్న ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
 
15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 
 
ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారని ప్రాథమికంగా తెలుస్తున్నా.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. 
 
ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు కొన్ని కారణాలతో నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే.