గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (13:25 IST)

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సీఎం జ‌గ‌న్... పులివెందుల‌లో స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

క‌డ‌ప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో  ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్నారు. పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భార‌తీల‌తో క‌లిసి క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో కేక్‌ కట్‌ చేశారు. ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం, చర్చి కాంపౌండ్‌లో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.