శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (14:40 IST)

నా వద్ద ఏముంది... నేను గెలిచి ఉండొచ్చు.. అపార అనుభవజ్ఞుడు : పవన్ కళ్యాణ్

pawan kalyan
తాను ఎమ్మెల్యేగా గెలిచివుండొచ్చు గానీ.. తన వద్ద ఏముందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద అపారమైన అనుభవం ఉందని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముగిసిన ఎన్నికల్లో ఎన్డీయ కూటమి విజయానికి కృషి చేశానని తెలిపారు. కానీ, చంద్రబాబు తన అపారమైన అనుభవంతో మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. గత నాలుగున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే వేతనాలు వచ్చాయని చెప్పారు. సరైన నాయకత్వం ఉంటే తక్కువ సమయంలో అనేక సమస్యలు పరిష్కరామవుతాయని రుజువు చేయడానికి ఇదొక్కటే నిదర్శనమన్నారు. 
 
అదేసమయంలో తనను ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయొద్దని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కట్టడానికి తాను ప్రయత్నం చేశానని... విజయానికీ దోహదపడ్డానని... కానీ చంద్రబాబు తన అపారమైన అనుభవంతో మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. 1వ తేదీనే 90 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు క్రెడిట్ అయినట్లు చెప్పారు. సరైన నాయకత్వం ఉంటే తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా మనం పెన్షన్లను అందించామన్నారు. నా వద్ద ఏముంది... చంద్రబాబు వద్ద అపార అనుభవం ఉందన్నారు.
 
ఇకపోతే గత ప్రభుత్వం రుషికొండలో ప్యాలెస్ కట్టడానికి రూ.600 కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. అంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించారు. ఆ ఖర్చుతో నియోజకవర్గాలలోని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండేదన్నారు. కోట్లు సంపాదించే తాను కూడా అలాంటి బాత్రూం కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్ కొందామని... తనకు అధికారులు సూచించారని... కానీ వద్దని వారిని వారించానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఒక్క రూపాయి వేస్ట్ చేయవద్దని అధికారులకు సూచించానన్నారు. తాను ఫర్నీచర్ కొనుగోలు చేయకుంటే ఆ మొత్తం ఉద్యోగి వేతనానికి వెళ్తుందన్నారు.