సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (11:34 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయశాఖలో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. 
 
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. 
 
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబరు 30
దరఖాస్తు చివర తేదీ: జనవరి 19, 2022
ఎంపిక; కంప్యూటర్ ఆధారిత పరీక్ష (స్క్రీనింగ్, మెయిన్స్)
 
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసై ఉండాలి
పే స్కేల్: రూ.16, 1400-రూ.49,870
వయస్సు: 01.07.2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.