బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (09:04 IST)

సినీ ఆర్టిస్టుపై అసభ్యంగా ప్రవర్తించాడు.. భర్త అప్పు తీసుకున్నాడని?

సినీ ఆర్టిస్టుగా పనిచేసే మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇందిరానగర్‌లో ఓ సినీ ఆర్టిస్టు (30) కుటుంబంతో కలిసి నివసిస్

సినీ ఆర్టిస్టుగా పనిచేసే మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇందిరానగర్‌లో ఓ సినీ ఆర్టిస్టు (30) కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త ఇదే ప్రాంతంలో ఉండే జయరామ్‌ అనే వ్యక్తికి రూ.30వేలు అప్పుపడ్డాడు. అప్పు అడిగేందుకుని ఆదివారం వారింటికి వెళ్లిన జయరామ్ సినీ ఆర్టిస్ట్ ఫోన్‌ను లాక్కొని.. అసభ్యంగా ప్రవర్తించాడు.
 
అతని నుంచి తప్పించుకుని.. కేకలు వేస్తూ ఆమె బయటకు పరుగులు తీసింది. దీంతో స్థానికులు వచ్చేసరికి జయరామ్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.