మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (10:51 IST)

శిరీష లోదుస్తులపై వీర్యపు మరకలు లేవు: ఫోరెన్సిక్ రిపోర్టు

బ్యూటీషియన్ శిరీష లోదుస్తులపై ఎలాంటి మరకలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. హైదరాబాద్‌కు చెందిన శిరీష గత నెలలో అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకోగా, దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆమె

బ్యూటీషియన్ శిరీష లోదుస్తులపై ఎలాంటి మరకలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. హైదరాబాద్‌కు చెందిన శిరీష గత నెలలో అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకోగా, దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆమె లోదుస్తులపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. 
 
ముఖ్యంగా శిరీష్ ధరించిన ప్యాంటీపై కొన్ని మరకలు ఉన్నాయని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిపి ఆపై చంపేసివుంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు. అయితే, శిరీష అత్యాచారానికి గురికాలేదన్న విషయాన్ని ఈ నివేదిక తేల్చింది. శిరీష లోదుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలేనని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. 
 
వీర్యానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లూ లభించలేదని పేర్కొన్నారు. కాగా, ఈ రిపోర్టుతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని, తనపై అత్యాచారయత్నం జరగడంతో, నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసు వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.