శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (09:37 IST)

వైఎస్ఆర్ మృతి వెనుక అనేక అదృశ్య శక్తులు : భూమన ఆరోపణ

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక అనేక అదృశ్యశక్తులు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక అనేక అదృశ్యశక్తులు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరులో జరిగిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ మృతి వెనుక అనేక శక్తులున్నాయని, విచారణకు డిమాండ్‌ చేసినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమాత్రం స్పందించలేదన్నారు. 
 
పనామా, గ్వాటిమాలా దేశాల అధ్యక్షులు తమతమ దేశాల్లోని చమురు ఉత్పత్తులపై అమెరికా గుత్తాధిపత్యాన్ని ఎదిరించి విమాన ప్రమాదాల్లో మరణించిన ఉదంతాలను ప్రస్తావించారు. అదేతరహాలో రాష్ట్రంలోని గ్యాస్‌ నిక్షేపాలు ఇతరులకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే వైఎస్‌ కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారన్నారు. ఆయన మరణం వెనుక అనేక శక్తులు కలసి పనిచేశాయని, విచారణ జరిపించాలని తాము ఎంత గొంతు చించుకున్నా అప్పటి యూపీఏ ప్రభుత్వంగానీ, సోనియా గాంధీగానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.