శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 28 జులై 2017 (18:39 IST)

మాకు ఒంగోలు జాతి గిత్తలు కావాలి... స్పీకర్ కోడెలను కలిసిన బ్రెజిల్ వ్యాపారులు

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాం

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాంబరులో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది.
 
ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి(Ongole Bulls Cattle Breeding Development)గాను ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని కరపర్చిన నేపధ్యంలో ఈ ప్రతినిధి బృదం ఇక్కడకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో బ్రెజిల్ దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా స్పీకర్ శివ ప్రసాదరావు మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రాముఖ్యతను వారికి వివరించారు.