గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (18:33 IST)

తిరుమల- మాధవ నిలయం అన్నదాన కేంద్రం భోజనంలో జెర్రి

Centipede Found in Tirumala
Centipede Found in Tirumala
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. టీటీడీకి చెందిన మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనంలో జెర్రి వచ్చింది. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రీ చూసి షాకయ్యాడు. వెంటనే అక్కడున్న సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. 
 
టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కన్పించడం భక్తుల్లో ఆందోళనను రేకెత్తించింది. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సదరు భక్తుడు.. తనకు కల్గిన అనుభవాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది.