గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:07 IST)

జగన్ అక్రమాస్తులు ప్రభుత్వానికి ఇచ్చేయాలి.. అగ్రిగోల్డే బెటర్: చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని తాను

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని తాను ఎన్నడూ అనలేదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు ఆనందంగా ఉంటే, వారి ఓట్లు టీడీపీకే పడతాయని... అలాంటప్పుడు ఇతర పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2004 నాటికి జగన్ తన వద్ద ఉన్న ఆస్తులను అట్టిపెట్టుకుని.. ఆ తర్వాత సంపాదించిన ఆస్తుల్ని అప్పగించాలన్నారు. జగన్ తెలివైనవాడు కనుక... 2004 వరకు ఆయన వద్ద ఉన్న ఆస్తులతో వ్యాపారం చేసినా.. 20 శాతం సంపాదించుకున్నాడు అనుకోవచ్చు. ఆ మొత్తంతో పాటు మరో 20 శాతం అదనంగా వుంచుకుని, మిగిలినదాన్ని ప్రభుత్వ పరం చేయాలని సూచించారు.
 
అలా చేస్తే, జగన్ నిజాయతీ ప్రజలకు అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో అక్రమాలకు పాల్పడే వారికి స్థానం లేదన్నారు. జగన్ కంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలే బెటర్ అని... వాటి ఆస్తులను అమ్మైనా డిపాజిట్ దారులకు న్యాయం చేయవచ్చునని వెల్లడించారు.