శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (20:25 IST)

సీఎం చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కంగారు పుట్టింది... నారా లోకేష్(Video)

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారు విజయం సాధించినప్పుడు తనకు కంగారు పుట్టిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎందుకంటే ఆనాడు విభజన కారణంగా లోటు బడ్జెట్టుతో వున్న ఏపీని అభివృద్ధి బాటలో నడిపించడం సాధ్యమా అని డౌటు పడ్డామనీ, కానీ ఆ తర్వాత ఆ అనుమానాలు పటాపంచాలయ్యాయన్నారు. 
 
ఇల్లు లేని ప్రతి వ్యక్తి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్. శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం, రేణిగుంట విమనాశ్రయం సమీపంలో ఉన్న వికృతమాల గ్రామం వద్ద రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ. 100 కోట్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో  నిర్మించిన 1800 జి ప్లస్ త్రి గృహాలు, వికృతమాల ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కాలనీలను ప్రారంభోత్సవం చేశారు.
 
పేదవాడికి సొంతింటి కలను సాకారం చేశామని, 2022 నాటికి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు మంత్రి లోకేష్. మోడీ ఎపికి తీరని అన్యాయం చేశారని, ఆయన పని పడతామని, ఎపిలో పర్యటించే అర్హత మోడీకి లేదన్నారు లోకేష్. ఎపికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఇంకా ఆయన మాటలను ఈ వీడియోలో చూడండి...