మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (15:27 IST)

తొమ్మిది మంది జీవితాల్లో వెలుగులు నింపిన చరితారెడ్డి

అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చరితారెడ్డి.. తాను మరణిస్తూ 9 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. తొమ్మిది మందికి అవయవదానం చేసింది చరితారెడ్డి. కిడ్నీలు, లివర్‌, కళ్లు దానం చేసినట్లు అమెరికా వైద్యులు ప్రకటించారు. 
 
చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత శుక్రవారం అమెరికా మిచిగాన్‌లో రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి మృతిచెందింది. తాను చనిపోయి తొమ్మిది మందిని బతికించిన గొప్ప వనిత చరితారెడ్డి అంటూ ఇప్పుడు అమెరికా సమాజం ఆమెను కీర్తిస్తోంది. 
 
అంత విషాదంలోనూ ఆమె ఫ్యామిలీ గొప్ప నిర్ణయం తీసుకుని విషాదంగా ముగియాల్సిన మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపారంటూ అక్కడి వైద్యులు వారి త్యాగాన్ని కొనియాడారు. ప్రస్తుతం చరితారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.