శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 మే 2019 (20:56 IST)

బాబు కష్టపడినా ప్రజలు ఓడగొట్టారు... ఎందుకో అర్థంకావడంలేదు... చినరాజప్ప

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి గెలుపొందినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారాయన. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు కష్టపడి పనిచేసినా ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. 
 
ఇవిఎంలపైన ఓ కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇవిఎంలపై మాట్లాడుతామన్నారు చినరాజప్ప. చినరాజప్ప వెంట స్థానిక టిడిపి నాయకులు కూడా ఉన్నారు.