బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:12 IST)

15 నుంచి చిన వెంకన్న కల్యాణోత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వేంక టేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి 22 వరకు ఆశ్వయుజ మాస తిరు కల్యాణోత్సవాలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అక్టోబరు 15వ తేదీ ఉదయం స్వామి, అమ్మ వార్లకు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరణ, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై కోవెల ఉత్సవం, 16న ఉదయం ధ్వజారోహణ, 17న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనాలపై కోవెల ఉత్సవం, 18న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై కోవెల ఉత్సవం, రాత్రి 7 గంటల కు ఎదుర్కోలు ఉత్సవం, 8.30కు వెండి శేష వాహనంపై కోవెల ఉత్సవం నిర్వహి స్తామన్నారు.

19న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై కోవెల ఉత్సవం, రాత్రి 7 గంటలకు శ్రీవారి తిరు కల్యాణోత్సవం అనంతరం వెండి గరుడ వాహ నంపై కోవెల ఉత్సవం. 20న రథోత్సవం, 21 ఉదయం 10:30కు చక్రవారి అవభృధో త్సవం, రాత్రి 7కు ధ్వజావరోహణ, 8 గంటలకు  అశ్వ వాహనం పై  కోవెల ఉత్స వం, 22 ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు నిలిపివేస్తామన్నారు.