మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:25 IST)

గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ గా బి-ఫాం అందుకున్న కత్తెర హెని క్రిస్టినా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కం అయిన గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్ గా కత్తెర హెని క్రిస్టినా ఎన్నిక ఇక లాంఛ‌న‌మే. బుధ‌వారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్ఠానం బి.ఫామ్ కూడా ఇచ్చేసింది. దీనితో ఆమె ఎన్నిక ఇక నామ‌మాత్ర‌మే కానుంది. 
 
గుంటూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచ‌రిత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు చెరుకువాడ రంగరాజు, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు పార్టీ బీఫాం ను కత్తెర హెని క్రిస్టినా కు అంద‌జేశారు. గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ గా నియమితులు అవ్వడానికి ఈ బిఫాం ఎంతో ముఖ్యం. దానిని పార్టీ త‌న‌కు అందించినందుకు కత్తెర హెని క్రిస్టినా సురేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.