శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (15:53 IST)

ఇద్దరు భార్యలతో సంసారం.. కేసులు పెట్టిన ఇద్దరు భార్యలు... చివరికి?

ఒక్క భార్యతోనే ప్రస్తుత కాలంలో నెట్టుకురావడం కష్టం. అలాంటిది ఓ వ్యక్తి ఇద్దరు భార్యలతో సంసారం చేస్తున్నాడు. అదీ ఒకరికి తెలియకుండా మరొకరితో సంసారం చేస్తున్నాడు. అయితే నిజం దాగలేదు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వెంకటచలపతి 13 సంవత్సరాల క్రితం సరస్వతి అనే యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. 
 
వీరికి ఒక కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన తర్వాత మరో యువతికి గాలం వేశాడు. బ్యాచిలర్‌నంటూ మోసం చేసి నెల్లూరుకు చెందిన మయూరిని ముగ్గులోకి దించాడు. అనంతరం కొద్దిరోజులకే మయూరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వేర్వేరుగా పెట్టి కాపురం చేయసాగాడు. ఈ క్రమంలో మొదటి భార్యకు భర్త వెంకటాచలపతి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. రెండు రోజుల క్రితం వెంకటాచలపతి రెండో భార్యతో కలిసి వెళ్తుండగా, ఈస్ట్ పోలీసు స్టేషన్‌ సమీపంలో పట్టుకుందామని మొదటి భార్య ప్రయత్నించింది. కానీ మొదటి భార్య, కూతురుని చూసి అతడు పారిపోయాడు. 
 
మొదటి భార్య, కూతురు ఎంత పిలుస్తున్నా.. ఎవరో తెలియనట్టు మొహం చాటేసి వెళ్లిపోయాడు. దీంతో సరస్వతి తన కూతురితో కలిసి రోదించింది. తండ్రి ప్రవర్తన గురించిన తెలిసిన కూతురు.. అమ్మా.. నాన్న మనకొద్దు.. మర్చిపోమ్మా.. విడాకులిచ్చేయ్.. అంటూ ఏడ్చింది. ఈ ఘటన కాస్త మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించి సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
 
ఇదే సమయంలో రెండో భార్య మయూరి సైతం వెంకటచలపతి తనన మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఒకరికి తెలియకుండా మరొకరికి ఏళ్ల తరబడి ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేసిన చలపతికి ప్రస్తుతం ఇద్దరు భార్యలు కేసు పెట్టడంతో చుక్కలు కన్పించనున్నాయి.