శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (17:28 IST)

ఏపీలో థియేటర్ల మూసివేత పరంపర.. చిత్తూరులో 37 జిల్లాలో క్లోజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపరంపర కొనసాగుతోంది. థియేటర్లలో సౌకర్యాల లేమి పేరుతో వీటిని స్థానిక తనిఖీలు నిర్వహిస్తూ థియేటర్లను మూసివేస్తున్నారు. తాజాగా చిత్తూరులో 37 థియేటర్లను మూసివేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందులో జిల్లాలోని మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోటలో 3, బి కోటలో 2, పీలేరులో 4, పుంగనూరులో 4, రొంపిచర్లలో 2, కలికిరిలో 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబళ్ళపల్లిలలో ఒక్కో థియేటర్ చొప్పున అధికారులు మూసివేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి 37 థియేటర్లు మూతపడ్డాయి. 
 
దీనిపై మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ, థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించడం, లైన్సెన్స్‌లు పునరుద్ధించకపోవడం తదితర కారణాల కారణంగా థియేటర్లను మూసివేసినట్టు చెప్పారు. ఇప్పటికు జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 థియేటర్లను మూసివేసినట్టు తెలిపారు. సౌకర్యాల లేమిపై ప్రేక్షకులు సైతం తమకు ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.