సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (10:00 IST)

సీఎం రమేష్ కొత్తగా లగ్జరీ ఫ్లైట్ కొనుగోలు చేశారా?

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇపుడు ఓ లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, కడప ఎయిర్‌పోర్టులో ఈ విమానికి ప్రత్యేక పూజలను కూడా ఆయన చేశారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, రాజకీయ పరమైన విమర్శలు కూడా వినిపించాయి.
 
దీంతో సీఎం రమేశ్ ప్రతినిధులు స్పందించారు. ఆ విమానం సీఎం రమేశ్‌కు చెందినది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సీఎం రమేశ్ ను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. 
 
విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రమేశ్ సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయ కొట్టారే తప్ప, విమానం ఆయనది కాదని ఓ ప్రకటనలో వివరించారు. సీఎం రమేశ్ ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి కావడంతో ఆయన సొంతంగా చిన్న విమానం కొనుగోలు చేశారంటూ కథనాలు వచ్చాయి. 
 
కాగా, సీఎం రమేశ్ సన్నిహితుడు ఒకరు కొత్తగా లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేయగా, ఆ విమానానికి సీఎం రమేశ్ కడప ఎయిర్ పోర్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రమేష్ కూడా హాజరై, లాంఛనంగా కొబ్బరికాయ కొట్టారు. ఆపై విమానంలోకి ప్రవేశించారు. దీంత ఈ విమానం సీఎం రమేశ్ దేనంటూ విపరీతమైన ప్రచారం జరిగింది.