శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:04 IST)

57వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు..మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి

రాజధాని రైతుల ఆందోళనలు 57వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 57వ రోజు రిలే దీక్షలు జరగనున్నాయి.

మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటల దీక్షలు నిర్వహించనున్నారు.

నేడు మందడం, వెలగపూడిలోనూ రైతులు 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతు కూలీలు, మహిళలు షిరిడి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
 
మోడీ, అమిత్‌షా వద్దకు టిడిపి
రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంలో ప్రధాని మోడీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలని, మీరు శంకుస్ధాపన చేసిన అమరావతిని తరలించేందుకు వైసిపి ప్రయత్నిస్తోందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలని టిడిపి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ అంశాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించగా సభ్యులు బలపరిచారు. ఇందు కోసం త్వరలో టిడిపి ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.