నోట్ల రద్దుతో జనం ఇబ్బందుల్లో ఉంటే, ఇంట్లో నిద్రపోతావా? జగన్ పైన దేవినేని విసుర్లు...
విజయవాడ : నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ 15 రోజులుగా ఇంట్లో పడుకున్నాడని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు అంశంలో జగన్ ఓ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయాడన్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవ
విజయవాడ : నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ 15 రోజులుగా ఇంట్లో పడుకున్నాడని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు అంశంలో జగన్ ఓ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయాడన్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నాడని, దివీస్ యాజమాన్యాన్ని జగన్ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు.
ఇవ్వలేదు కనుకే దివీస్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల యాజమాన్యాలని జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడన్నారు. దివీస్ ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతుందని, జగన్ బంధువుల ఫార్మా కాంపెనీల్లో కాలుష్యం జరుగుతున్నా వాటిపై ఎందుకు మాట్లాడరు... జగన్‌కి ఉన్న కేసులు చాలవా కొత్త కేసులు కావాలా...? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అచ్చోసిన అంబోతుల్లా హెరిటేజ్ పైన బురదజల్లుతున్నారు... అని దేవినేని ఉమ విమర్శించారు.