గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 27 జూన్ 2017 (21:41 IST)

ఏపీ రైతులూ... మీ సమస్యల చెప్పుకునేందుకు డయల్ యువర్ సీఈఓ(ఏపీ)..

రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ప్రత్యేక వ్యవసాయ కమీషనర్ డా. ఎం.హరి జవహర్ లాల్ ఐఏఎస్ 29.06.2017 ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు వ్యవసాయ రుణ ఉపశమన పథకం 2014 అమలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులతో నేరుగా చర్చించేందుకు 08676-

రైతు సాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ప్రత్యేక వ్యవసాయ కమీషనర్ డా. ఎం.హరి జవహర్ లాల్ ఐఏఎస్ 29.06.2017 ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు వ్యవసాయ రుణ ఉపశమన పథకం 2014 అమలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులతో నేరుగా చర్చించేందుకు 08676-252858 నంబరుతో డయల్ యువర్ సీఈఓ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
 
కావున రాష్ట్రంలోని రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరని విజ్ఞప్తి చేసారు. ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులు వారి ఆధార్ సంఖ్య లేదంటే రేషన్ కార్డు సంఖ్య లేదంటే రుణము పొందిన బ్యాంకు, బ్రాంచ్ పేరు మరియు ఖాతా నంబరు తెలియజేయాలని సూచించారు.