గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (18:08 IST)

మాది అపవిత్ర బంధమా? ఆ కెమెరామెన్ ఎవరో మాకు తెలియదు : దివ్వెల మాధురి (Video)

Duvvada Srinu- Madhuri
ఇటీవల వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ తిరుమల పుణ్యక్షేత్రంలో ఫోటో షూట్ చేశారు. దీంతో దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాధురి వివరణ ఇచ్చారు. 
 
తిరుమలలో తాను ఎలాంటి ఫోటోషూట్ చేయలేదని, ఒక్క రీల్ కూడా రికార్డ్ చేయలేదని, దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టులు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ వెంట వచ్చిన కెమెరామెన్ మీడియాకు చెందిన వ్యక్తి అని, అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మాధురి చెప్పారు. తాము వద్దని వారిస్తున్నా వినకుండా తమ వెంటపడ్డాడని తెలిపారు. మీడియా చానళ్ళకు చెందిన ప్రతినిధులే ఆ కెమెరామెన్‌ను తన వెంట పంపించారని ఆరోపించారు. 
 
తాను తిరుమల మాడవీధుల్లో తన సొంత సెల్‌ఫోనుతో సాయంత్రం వేళ ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయానని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పోలీసులు ఫిర్యాదు చేసినవారు. తాను తిరుమలలో ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ తీసినట్టు చూశారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కాగా, ఆమెపై కేసుతో దివ్వెల మాధురి చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.