సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (15:12 IST)

గుంటూరులో డ్రగ్స్ తయారీ...

జిల్లా కేంద్రమైన గుంటూరులో డ్రగ్స్ తయారీ దందాను పోలీసులు గుర్తించారు. జిల్లాలోని నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు కనుగొన్నారు. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా డ్రగ్స్, ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నాడు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.