తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్
తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది.
అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పిజి ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పిఇసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టిసిఎస్ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది.
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు డిడి యాదగిరి, టిశాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని సూచించింది.
అలాగే కాలేజీల ప్రిన్సిపల్స్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.