ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (12:06 IST)

వైకాపా తరపున పోటీ చేస్తున్న సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ??

JD Lakshminarayana
వచ్చే యేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పని చేసి పదవీ విరమణ పొందిన వివి లక్ష్మీనారాయణ ఏపీలోని అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతుంది. ఈ తరహా ప్రచారం సాగడానికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల వైకాపా ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని, అంగన్‌వాడీలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలు వైకాపా తరపున పోటీ చేయబోతున్నారనే  ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలతో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైకాపాలో చేరడం లేదని  స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.