సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (09:15 IST)

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

road accident
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు - కంటైనర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. కారులో ఉన్నవారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదంలో చిక్కుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. మృతులంతా చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
కాగా, రోడ్డు ప్రమదాం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ యు.వెంకటకుమార్, సీకె దిన్నె, సీై శంకర్ నాయక్ రామాపుర సీఐ వెంకట కొండారెడ్డిలు ఉన్నారు.