గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (13:39 IST)

కడప జిల్లాలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

gang rape
వైఎస్సార్ కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపుతుంది. ఏపీ, కడప జిల్లా గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్‌లో రికార్డు చేసి మరీ ఆ బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు.

అయితే ఈ దారుణానికి పాల్పడింది కూడా మైనర్లేనని వారు పది, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.