సంబంధిత వార్తలు
- గాడ్ ఫాదర్ క్లైమాక్స్ నచ్చలేదుః సీక్రెట్ చెప్పిన చిరంజీవి
- చిరంజీవి "గాడ్‌ఫాదర్" చిత్రాన్ని చూసిన రజనీకాంత్ - ఎక్స్లెంట్.. వైరీ నైస్..
- రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి, 100 కోట్ల గ్రాస్ వచ్చిందా!
- చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం : నయనతార
- స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్కు కొడుకు... ప్రసవించిన భార్య ఫ్రాన్సిస్కా
ధోనీ గురించిన ఆసక్తికర అంశాలు.. యావరేజి స్టూడెంట్ అని...
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. చదువులో తన పరిస్థితి ఏంటో వివరించాడు. తాను కనీసం టెన్త్ కూడా పాస్ కాలేనని తన తండ్రి భావించేవాడని ధోనీ వెల్లడించాడు.
ఏడో తరగతిలో తాను క్రికెట్ ఆడడం ప్రారంభించే సమయానికి యావరేజి స్టూడెంట్ నని, ఆ తర్వాత నుంచి హాజరు క్రమంగా తగ్గడం మొదలైందని ధోనీ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ, టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి తాను మంచి విద్యార్థిగానే గుర్తింపు తెచ్చుకున్నానని, టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తనకు 66 పర్సంటేజీతో మార్కులు వచ్చాయని ఈ జార్ఖండ్ డైనమైట్ వెల్లడించాడు. ఇంటర్ లో 57 శాతం మార్కులు వచ్చాయని తెలిపాడు.
క్రికెట్ కారణంగా తాను క్లాసులకు హాజరైంది చాలా తక్కువని, టెన్త్ క్లాసులో కొన్ని చాప్టర్లు తాను చదవనేలేదని పేర్కొన్నాడు. పబ్లిక్ పరీక్షల్లో ఆ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చుంటే తన పని గోవిందా! అని చమత్కరించాడు.
తర్వాతి కథనం
