బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (11:57 IST)

చిరంజీవి "గాడ్‌ఫాదర్" చిత్రాన్ని చూసిన రజనీకాంత్ - ఎక్స్‌లెంట్.. వైరీ నైస్..

godfather movie still
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త చిత్రం "గాడ్‌ఫాదర్". ఈ నెల 5వ తేదీన విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌తో కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సోమవారం చూశారు. ఆ తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
"ఎక్స్‌లెంట్, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్, తెలుగు వెర్షన్ కోసం చేసిన ప్రతి ఒక్క మార్పు ఆసక్తికరంగా ఉంది" అని ప్రశంసించారని ఆ చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. "థ్యాంక్యూ తలైవా... నా జీవితంలోని మధుర క్షణాల్లో ఇది కూడా ఒకటి" అని మోహన్ రాజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
ప్రముఖ నిర్మాతలు ఆర్.బి.చౌదరి, తిరుపతి ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో చిరంజీవితో పాటు నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్‌, సునీల్‌, మురళీశర్మ, మురళీమోహన్‌లు కీలక పాత్రలను పోషించారు.