గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 29 జులై 2017 (12:48 IST)

తిరుమలలో కిడ్నాపైన పాప క్షేమం

తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు

తిరుమలలో కిడ్నాప్ గురైన చిన్నారి నందిని ఆచూకీని కనిపెట్టి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బెంగుళూరులోని వర్తూరు దగ్గర మహిళా కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పాపను క్షేమంగా అప్పగించారు. ఈనెల 23వతేదీన తిరుమలలో ఆడుకుంటున్న చిన్నారిని ఒక మహిళ ఎత్తుకెళ్ళింది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పాలని ఆదేశించింది. 
 
కిడ్నాపరో ఫోటోను పోలీస్టేషన్లకు పోలీసులు పంపించి పాప కోసం బృందాలుగా ఏర్పడి వెతికారు. కిడ్నాపర్ షాలినిని బెంగుళూరు అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న రాత్రి పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను ఎందుకు కిడ్నాప్ చేసిందో తెలియాల్సి ఉంది.