గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (12:24 IST)

దిలీప్ కుమార్ మృతికి గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ సంతాపం

బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా ప్రసిద్ది చెందిన న‌ట దిగ్గజం దిలీప్ కుమార్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ విభిన్నమైన నటనతో భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని, విభిన్న తరాల నటులకు ఆయన ప్రేరణ అని అన్నారు.

దిలీప్ కుమార్ ఐదు దశాబ్దాల తన కెరీర్లో దేశం గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరిగా నిలిచారన్నారు. దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వ భూషణ్హరిచందన్ తన హృదయపూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు ఏపీ రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.