ఆ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యారా..? సోఫాలో కుప్పకూలిపోయారు..
మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సరళి పరిశీలిస్తే ఎమ్మెల్యేగా నాని ఓడిపోతారని తెలిసినట్టు సమాచారం. ఈ బెంగతోనే నాని అస్వస్థతకు గురయ్యినట్లు చర్చ జరుగుతోంది. గుడివాడలోని తన స్వగృహంలో గురువారం నందివాడ మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొడాలి నాని సమీక్ష నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పరిస్థితిని నాయకులను ఆరా తీశారు. మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా నాని సోఫాలో కుప్పకూలిపోయారు. కొన్ని నెలల కిందట అనారోగ్యానికి గురైన నాని మళ్లీ అస్వస్థతకు గురవడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురి చేస్తుంది.
కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లు తెలుస్తోంది.