శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (15:57 IST)

హీరో రామ్ ఇకనైనా జాగ్రత్తపడితే మంచిది: మంత్రి కొడాలి నాని హెచ్చరిక

విజయవాడ లోని రమేష్ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరగడం, పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి. రమేష్ హాస్పిటల్‌‌ని అన్యాయంగా బలి చేస్తున్నారంటూ రామ్ ట్వీట్ చేశారు. దీనిపై తాజాగా మంత్రి కొడాలి నాని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. 
 
ఇవాళ విజయవాడ రమేష్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి, కొడాలి నాని హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి మాట్లాడుతూ... రమేష్ హాస్పిటల్ యజమాని రమేష్ వెనుక అనేకమంది బడా నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఆసుపత్రి యజమాని రమేష్ ఎక్కడ వున్నారో ప్రజలకు తెలుసున్న ఆయన, అతడి మాటలను హీరో రామ్ వినకుండా ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిదని వార్నింగ్ ఇచ్చారు.