సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:59 IST)

చలి కాలంలో హీటర్లు... చాలా చాలా జాగ్రత్తగా వుండాలి...

చలికాలం వచ్చిందంటే హీటర్లతో పని ఎక్కువుంటుంది. వెచ్చదనం కోసం రూమ్ హీటర్ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంటారు. కానీ అగ్ని ప్రమాదల కారణంగా సంభవించే మరణాల్లో సగానికి పైగా రాత్రి వేళల్లో, అందరూ నిద్రపోతున్న సమయంలోనే జరుగుతున్నాయని ఓ అంచనా. ఇంట్లో అలారం వ్యవస్థ వుంటే ఏ చిన్న ప్రమాదన్నయినే ఇట్టే నివారించవచ్చు. 
 
ఇలాంటివి మనకు అవసరమా అని చాలామంది కొట్టిపారేస్తుంటారు. కానీ చిన్న ప్రమాదాలే భారీ నష్టం కలిగించేవి అవకాశాలు చాలాసార్లు జరిగాయి. అందువల్ల ఇంట్లోని గదుల్లో స్మోక్ అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెపుతున్నారు. ఎందుకంటే ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదాల్లో వాటర్ హీటర్ల కారణంగా జరిగేవి రెండో స్థానంలో వుంటున్నాయట. అందుకో వాటర్ హీటర్లను ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఎక్కువ వోల్టేజీ తీసుకునే స్విచ్ బోర్డుల్లోనే పోర్టబుల్ వాటర్ హీటర్ పెట్టాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం వుంది.