శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (17:17 IST)

కరోనాతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం

సాటి హోం గార్డు క‌రోనాతో చ‌నిపోతే, జిల్లాలోని పోలీసు హోంగార్డులు అంతా స్పందించారు. అత‌ని కుటుంబానికి అండ‌గా నిలిచారు. అనంత‌పురం జిల్లాలో ఈ ఏడాది మే నెలలో కరోనాతో మృతి చెందిన హోం గార్డు టి.ఖాసీం సాహెబ్  ( హెచ్ జి నంబర్ 39) కుటుంబానికి రూ. 4,35,000/- ఆర్థిక సాయం అందించారు తోటి సిబ్బంది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో మృతుడి భార్య టి.హసీనాకు అందజేశారు.
 
 జిల్లా హోంగార్డులు ప్రతీ ఒక్కరూ తమ గౌరవ వేతనం నుండీ రూ. 600/- వితరణగా సహచర మృత కుటుంబానికి అందజేయడం అభినందనీయమని ఎస్పీ ఫ‌కీర‌ప్ప‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి రామకృష్ణ ప్రసాద్, హోంగార్డుల ఇన్ఛార్జి రిజర్వ్ ఇన్స్పెక్టర్ శివరాముడు, తదితరులు పాల్గొన్నారు.