పోలీసుల సంక్షేమానికి డీజీపీ కృషి అభినందనీయం: ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్
రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేస్తోన్న కృషి అభినందనీయమని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు.
బుధవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర పోలీసుల సొంతింటికల నెరవేర్చేదిశగా భద్రతా పథకం క్రింద ఇల్లు కొనుగోలు/ నిర్మించుకునేందుకు కేవలం 5 శాతం వడ్డీ కి 40 లక్షల రూపాయలు ఇంటి స్థలం కొనుగోలుకు 25 లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించడం ద్వారా పోలీసు సిబ్బంది కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయని అన్నారు.
పోలీసు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ లోన్ రూ.50లక్షలకు పెంచడం, భద్రత పథకం లో కొత్తగా వాహనాలు (టూ వీలర్, ఫోర్ వీలర్ ) కొనుగోలు చేసేందుకు రుణ మంజూరు చర్యలు చేపట్టడం హర్షదాయకమని ఏపీ పోలీస్ అధికారుల సంఘ సభ్యులు కొనియాడారు. ఈ ఉత్తర్వులు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు వారు తెలిపారు.