గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (19:44 IST)

రూ.లక్ష కోట్ల రూపాయలతో 30 లక్షల 75 వేల మందికి ఇళ్ళు: కొడాలి నాని

లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్థితో రాష్ట్రంలోని 30 లక్షల 75 వేల మంది పేదల ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిజం చేసారని రాష్ట్ర పౌరసరఫరాలు,వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. 
 
బుధవారం నందివాడ మండలం అనమనపూడి గ్రామంలో నిర్వహించిన  నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొని అనమనపూడి,దండిగానపూడి, గాదేపూడి, ఉరుగుపాడు గ్రామాల్లోని 146 మంది లబ్దిదారులకు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలసి ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 23 వేల కోట్ల విలువ గల 63 వేల ఎకరాలను 30 లక్షల 75 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను అందిస్తున్నారు.  మొదటి దశలో 14లక్షల 80 వేలు ఇళ్లు, రెండవ దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు.

ఇంటి యజమాని అవసరమైతే పైన మరో ప్లోరు వేసుకునే విదంగా స్ట్రాంగ్ గా ఇంటి నిర్మించడం జరుగుతుందన్నారు.ఇంటి పట్టాలను ఇవ్వకుండా అడ్డుతగిలి  ప్రతి పక్ష పార్టీ కొర్టులో కేసు వేసాయన్నారు.  ముఖ్యమంత్రి దూర దృష్టితో ముందుగా లబ్దిదారులకు  బి ఫారం  పట్టా అందించి కోర్టు తీర్పు తదుపరి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని చెప్పారు.

హిందూ, ముస్లీ, క్రైస్తవలకు పవిత్రమైన డిశంబరు 25 వ తేదీన పేదలకు ఇళ్ల స్థల పట్టాలను అందించామన్నారు.  జనవరి 15 తరువాత రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ గ్రామం వస్తారో తెలియదని, ఆ గ్రామంలో  అర్హులై ఉండి కూడా ఇళ్లస్థలాలు, రెషన్ కార్డులు వంటి  ప్రభుత్వ పథకాలు అందలేదని సీయంకు ఫిర్యాదులు చేస్తే సంబందిత సస్పెండ్ చేసే అవకాశం ఉందన్నారు.

రాజకీయాలకు అతీతంగా నందివాడ మండలంలో 2 వేల ఇళ్లస్థలాలను లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న భూమి ఎప్పుడో కొనుగోలు చేసిన ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడిందన్నారు. ఈ స్థలం పూడికకు ఎంత ఖర్చుఅయినా వెనకాడమన్నారు.  వైఎస్ఆర్ జనగన్న కాలనీల్లో డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. 

లబ్దిదారులు ఇళ్లు కట్టుకునేందుకు మూడు ఆప్షన్లు సీయం కల్పించారన్నారు.  మీరు స్వయంగా ఇల్లు నిర్మించుకుంటే దశలవారీ  మీ ఖాతాల్లో  అయిన ఖర్చును జమచేస్తారని లేదా మీరు కట్టుకోలేకపోతే 1.80 లక్షలతో ప్రభుత్వమే నిర్మిస్తుందని, లేదా ప్రభుత్వమే 1.23 లక్షలతో  మీ ఇంటికి అయ్యే మేటీరియల్ ను సరఫరా చేసి  లేబరు ఖర్చులు గా 57 వేల రూపాయలు అందజేస్తామన్నారు.

గత ప్రభుత్వంలో  రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని ప్రతి పక్షనేత మోసం చేసాడన్నారు.  నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి అనుకున్న గడువుకు  నాలుగు రోజులు ముందుగానే వాగ్దానం చేసిన పథకాలను లబ్దిదారులకు అందిస్తున్నారన్నారు. నివర్ తుఫాన్ ఇన్ పుట్ సబ్సిడీ, మూడవ విడత రైతు భరోసా గారూ.1705 కోట్లను  కంప్యూటర్ బటన్ నొక్కి  రైతుల ఖాతాల్లో సీయం జగన్మోహన్ రెడ్డి  జమచేసారన్నారు.

గతంలో గ్రామాల్లో సమస్యలు ఉండేవని నేడు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేవని అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందడమే దీనికి నిదర్శనం అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం ఇన్ని పథకాలను అందించిన  సీయం జగన్మోహన్ రెడ్డిని నిండు మనస్సుతో ఆశీర్వదిద్దామన్నారు. 

గుడివాడ- పోలుకొండ రహదారి అభివృద్దికి రూ.2.90 కోట్లు మంజూరుఅయ్యాయని త్వరలో రహదారి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కుదరవల్లి-కలింగపేట రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. గుడివాడ  నియోజకవర్గంలోని చివరి ప్రాంతాల వరకు రహదారుల మరమ్మత్తులకు  గాను అధికారులు రూ.90 లక్షలతో ప్రతిపాదనలు అందించారని, త్వరలో రోడ్ల మరమ్మత్తులు చేపడతామన్నారు. 

కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం, గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మొండ్రు సునీత, వైస్ చైర్మన్ తోట నాగరాజు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొండపల్లి కుమార్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు తిరుమలశెట్టి ఉషారాణి, మండల ప్రముఖులు మురళీరెడ్డి, గూడపాటి వెంకటేశ్వరరావు, మొండ్రు వెంకటేశ్వరరావు, చింతాడ నాగూర్, హౌసింగ్ డీఈ రామోజీనాయక్, మండల తహసీల్దార్ అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్, ఎండీవో మోహన్ ప్రసాద్, రూరల్ సీఐ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు .