సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (09:26 IST)

నీవు లేని జీవితం నాకొద్దు ప్రియా... నత్రజని గ్యాస్ పైపుతో సూసైడ్.. ఎలా?

ప్రేమ వివఫలమైన ఓ యువకుడు.. లేటెస్టి విధానంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, ముక్కులోకి నత్రజని గ్యాప్ పైపును చొప్పించి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

ప్రేమ వివఫలమైన ఓ యువకుడు.. లేటెస్టి విధానంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, ముక్కులోకి నత్రజని గ్యాప్ పైపును చొప్పించి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, కూకట్‌పల్లి ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2 ఎల్‌ఐజీ 67కు చెందిన అవినాశ్ (26) అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తూ వచ్చాడు. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అవినాశ్‌ మళ్లీ తిరిగి రాలేదు. తరచుగా చెప్పకుండా వెళ్లి.. రెండు మూడు రోజుల తర్వాత వచ్చే అలవాటున్న అవినాశ్‌ ఎప్పటిలాగే తిరిగివస్తాడడని కుటుంబసభ్యులు భావించారు.
 
అయితే, శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మలేసియన్‌ టౌన్‌షిప్‌ బ్లాక్‌ నంబరు 35 వద్ద ఆగివున్న కారు (ఏపీ 7ఈసీ1770)లోంచి దుర్వాసన వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. టౌన్‌షిప్‌ వాసులు ఇచ్చిన సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు వచ్చి కారు డోర్లు తెరిచి చూడగా.. అందులో అవినాశ్‌ మృతదేహం కనిపించింది. 
 
ప్లాస్టిక్‌ కవర్‌తో మొహానికి బిగించుకోని నైట్రోజన్‌ సిలిండర్‌ ద్వారా గ్యాస్‌ పీల్చి ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఓ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, జీవితంలో తాను ఓడిపోయానంటూ అందులో అవినాశ్‌ రాశాడు. 'నీవు లేని జీవితం నాకు వద్దు. మీ కుటుంబాన్ని చాలా కష్టపెట్టాను' అంటూ ప్రియురాలిని ఉద్దేశించి రాశాడు.