గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (09:06 IST)

భాగ్యనగరి అందాలు చూపిస్తానని భార్యను తీసుకొచ్చీ...

ఒడిషా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ అందాలు చూపిస్తానని భార్యను నమ్మించి తీసుకొచ్చి లాడ్జీలో హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా పారిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కుమార్‌(32), మధు సుమిత(27) భార్యభర్తలు. వీరిద్దరూ హైదరాబాద్ అందాలు చూసేందుకు వచ్చారు. తొలుత ఈ టూర్‌కు భార్య సమితరానని మొండికేసింది. కానీ, ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 
 
వారిద్దరూ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్‌ తీసుకుని బసచేశారు. ఈ క్రమంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటకు పొక్కింది. కాగా, తమ బిడ్డను ప్రశాంత్ హత్య చేసి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.