వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి లేపేసింది?
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి. ఈ దారుణ ఘటన పీణ్యా పరిధిలోని శివపురలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... రేఖమండల్ అనే మహిళకు ఎనిమిదేళ్ల బబ్లిమండల అనే కుమారుడు ఉన్నాడు.
ఈమె కొన్నాళ్లుగా విద్యుత్‌మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్, ప్రియుడు విద్యుత్ మండల్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఆ బాలుడిని దారుణంగా హత్యచేసింది. అనంతరం ఏమీ తెలీనట్టుగా తన కుమారుడు కనబడటం లేదని పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో వారే హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు రేఖామండల్, విద్యుత్ మండల్‌ను బుధవారం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.