ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మంది దినచర్యలో ఒక భాగంగా వుంటుంది. కానీ అది మీ ఆరోగ్యంపై కొన్ని వ్యతిరేక ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది.
ఈ కారణంగా అసిడిటీ, కడుపులో చికాకు, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.
టీలో ఉండే టానిన్లు, కెఫిన్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
దీనివల్ల ఆకలి లేకపోవడం, జీర్ణవ్యవస్థ బలహీనపడటం జరుగుతుంది.
టీలో ఉండే కెఫిన్ శరీరం నుండి నీటిని తొలగించడానికి పనిచేస్తుంది.
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
టీలోని టానిన్లు దంతాలపై మరకలు వేసి, దంతాలను దెబ్బతినేలా చేస్తాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.