నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి.
నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో నీరు ఉంటుంది, ఇది హైడ్రేషన్‌కు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలోని ఎ,సి,ఇ విటమిన్లు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, పోషకంగా ఉంచడానికి సహాయపడుతాయి.
నల్ల ద్రాక్షలో ఇనుము, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
నల్ల ద్రాక్షలోని ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతాయి.