గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (20:08 IST)

దేదీప్య‌మా‌నంగా ఇంద్ర‌కీలాద్రి... కోటి కార్తీక దీపాలు వెలిగించిన భ‌క్తులు

కార్తీక ‌పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై ఆదివారం నిర్వ‌హించిన కోటి దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆల‌య భాగంగా ప‌రిస‌రాలు దేదీప్య‌మానంగా వెలుగొందాయి.‌ దుర్గ‌గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబు దంపతులు పాల్గొని ఆదివారం సాయంత్రం ఇంద్ర‌కీలాద్రిపై అఖండ జ్యోతిని వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద  జ్వాలా తోరణం వెలిగించారు. ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే కోటి దీపోత్స‌వం కార్య‌క్రమానికి అనుమ‌తిచ్చారు. భ‌క్తులు కార్తీక‌ జ్యోతులు వెలిగించి దుర్గామ‌ల్లేశ్వ‌రుల‌కు నీరాజ‌నాలు ప‌లికారు.

కార్య‌క్ర‌మంలో పాలకమండలి సభ్యులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధానార్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పంచహారతుల సేవలో భాగంగా అమ్మవారికి గాన నీరాజనం, చిన్నారుల సాంస్క్రతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను అల‌రించాయి.