ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (12:24 IST)

బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ఖాన్‌కు డెడ్లీ బ్రెయిన్ కేన్సర్?

బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ఖాన్ ఓ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. నిత్యం విభిన్నమైన కథల కోసం అన్వేషించే ఈ నటుడు.. ఇపుడు అలాంటి రేర్ డిసీజ్‌తోనే బాధపడుతున్నాడు.

బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ఖాన్ ఓ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. నిత్యం విభిన్నమైన కథల కోసం అన్వేషించే ఈ నటుడు.. ఇపుడు అలాంటి రేర్ డిసీజ్‌తోనే బాధపడుతున్నాడు. ఫలితంగా బాలీవుడ్ ప్రముఖులంతా ఇర్భాన్ ఆరోగ్యం గురించే చర్చించుకుంటున్నారు. 
 
తెలుగులో 'సైనికుడు' అనే చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ పప్పుయాదవ్‌గా ఆలరించారు. ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగానే విశాల్ భ‌ర‌ద్వాజ్ దర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో సోష‌ల్‌మీడియాలో ఇర్ఫాన్ అనారోగ్యం గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్రసారమవుతున్నాయి. 
 
ఈనేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తున్న విభిన్న కథనాలపై ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఎప్పుడూ అరుదైన క‌థ‌ల కోసం అన్వేషించే నాకు అరుదైన వ్యాధి ఉన్నట్టు తేలింది. నేను ఎప్పుడూ ఓట‌మిని అంగీక‌రించ‌లేదు. ఇప్పుడూ కూడా అంగీక‌రించ‌ను. నా స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో ఈ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రయ‌త్నిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. 
 
అయితే, ఆయన డెడ్లీ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారన్నది ఇండస్ట్రీలో టాక్. కొన్ని రోజులుగా ఇర్ఫాన్ తన డిసీజ్ కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని... మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని దీంతో ఆయన ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇర్ఫాన్ కుటుంబ సభ్యుల నుంచి స్పందన లేదు.