శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (17:17 IST)

కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం వుందా? ఏం చేయాలి?

గుడివాడ: కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిఫుణులు హెచ్చరిస్తున్నందున ప్రజలందరూ కరోనా వైరస్ నియంత్రణ పట్ల అప్రమత్తతో అవగాహన కలిగి ఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ విజ్ఞప్తి చేశారు.
 
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో శ్రీనుకుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో నిన్న 18 కరోనా పాజిటి కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుందన్నందున ప్రజలు అత్యవసరమయితేనే తప్ప ప్రయాణాలు చేయడం, బయటకు రావడం మానుకోవాలన్నారు.

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ సమూహంలో, గుంపుల్లో తిరగవద్దని  మాస్కు తప్పనిసరిగా వినియోగిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.  సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల పాటు "నో మాస్క్ నో ఎంట్రీ”, “నో మాస్క్ - నో రైడ్", "నో మాస్క్ - నో సేల్ " నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదేశించియున్నారన్నారు.

డివిజన్ స్థాయిలోని మండలం గ్రామ స్థాయి అధికారులు  వినూత్నంగా  ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని  చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు.  ప్రతి సోమవారం నో మాస్క్ నో ఎంట్రీ నినాదంతో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి ప్రార్థన మందిరాల్లోకి, బ్యాంకులు, ఫోస్టుఆఫీసులు, మాల్స్, పబ్లిక్ పార్కులు, పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాలు, రెస్టారెంట్లులోకి మాస్కులులేకుండా అనుమతించకూడదని ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, వాల్పోస్టర్లు, మైక్ ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు మాస్కులు పంపిణీ చేయాలన్నారు.

ప్రతి మంగళవారం నో మాస్క్- నో రైడ్ నినాదంతో వాహన చోదకులు, ప్రయాణికులు, తప్పనిసరిగా మాస్కులను ధరించడంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ప్రతి బుధవారం నో మాస్క్ నో సేల్ అన్న నినాదంతో మాస్కులు ధరించని కొనుగోలు దారులకు దుకాణదారులు, సరుకులు, వస్తువులను విక్రయించకూడదన్నా ప్రచారాన్ని ముమ్మరం చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

ఇందులో భాగంగా బ్యానర్లు, ప్లేకార్డులు, ప్రదర్శించడం, కర్రపత్రాలు, స్టికర్లు, వాల్ పోస్టర్లు పంపిణీ చేయడం విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. డివిజన్ ప్రాంతంలోని అన్ని గ్రామాలను కోవిడ్ రహిత  గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారన్నారు.

రైతులు మంచి మనస్సుతో మద్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలను భూములను అందించాలి :- ఆర్డీవో శ్రీనుకుమార్
  గుడివాడ పట్టణంలో మద్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు (ఎంఐజీ స్కీమ్) క్రింద 400 ఎకరాలను గౌరవ  రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు పరిశీలించి సెలక్టు చేశారన్నారు. 

ఎకరాకు  రూ. 40 లక్షల రూాపాలయలు చొప్పున ప్రభుత్వం మంచి ధరను నిర్ణయించినందున రైతులు మంచి మనస్సుతో ముందుకొచ్చి ఎంఐజీ స్కీము తమ భూములను అందించి సహకరించవలసిందిగా ఆర్డీవో శ్రీనుకుమార్ ఈ సందర్భంగా  రైతులను కోరారు. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారుల వివరాలు, ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పని సరిగా ప్రదర్శించాలి.
 
జిల్లా కలెక్టరు వారంలో రెండు రోజులు గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని, సోమవారం పెదమద్దాలిలో గ్రామ సచివాలయాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు,  ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు వివరాలు వంటి ప్రదర్శన బోర్డులు లేనందున సచివాలయ కార్యదర్శి ని సస్పెండ్ చేశారన్నారు. డివిజన్ పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిటిజన్ ఛార్టులు, సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాలు సంబందించి అర్హతల వివరాలు, లబ్దిదారుల వివరాలు డిస్లై బోర్డులో ప్రదర్శించే విధంగా సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, యంపీడీవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు.