శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 8 డిశెంబరు 2016 (16:47 IST)

షాకింగ్... తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో క్వింటాలు(100 కిలోలు) బంగారం, రూ.70 కోట్ల కొత్త కరెన్సీ

అబ్బ... మొత్తానికి రూ.2000 కొత్త కాగితం నల్లధన కుబేరులను వరసబెట్టి పట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. రూ.2000 నోటులో ఏదో మాయాజాలం ఉందేమోననిపిస్తోంది. ఎందుకంటే రూ.2000 కరెన్సీని కుప్పలుగా పోసుకున్నవారు ఎవరయినా ఉన్నారని తెలిస్తే ఐటీ అధికారులు అక్కడ వాలిపోత

అబ్బ... మొత్తానికి రూ.2000 కొత్త కాగితం నల్లధన కుబేరులను వరసబెట్టి పట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. రూ.2000 నోటులో ఏదో మాయాజాలం ఉందేమోననిపిస్తోంది. ఎందుకంటే రూ.2000 కరెన్సీని కుప్పలుగా పోసుకున్నవారు ఎవరయినా ఉన్నారని తెలిస్తే ఐటీ అధికారులు అక్కడ వాలిపోతున్నారు. తనిఖీలు చేసి అక్రమ సంపాదన వెలికి తీస్తున్నారు. తాజాగా తితిదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే సంపద బయటపడింది. 
 
చెన్నైలోని ఆయన స్వగృహంలో చేసిన తనిఖీల్లో క్వింటాలు(100 కిలోలు) బంగారం పట్టుబడింది. ఇంకా రూ. 90 కోట్లు డబ్బు బయటపడింది. విచిత్రం ఏంటయా అంటే... ఈ 90 కోట్లలో రూ. 70 కోట్లు అన్నీ రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు. ఎంత దారుణం? వారానికి రూ.24 వేలు మాత్రమే బ్యాంకు నుంచి తీసుకోవాలంటూ ప్రభుత్వం సామాన్యులకు షరతులు విధించడంతో దేశంలో సామాన్యులు ఇంకా రోడ్లపైన డబ్బు కోసం పడిగాపులు కాస్తున్నారు. అత్యవసరం అని బ్రతిమాలినా వారానికి రూ.24 వేలు కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. అలాంటిది నెలరోజుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.70 కోట్ల రూ.2000 కరెన్సీ నోట్ల కట్టలు ఎలా సాధ్యమో... ఇచ్చిన బ్యాంకు వారికే తెలియాలి.