సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 22 ఆగస్టు 2019 (16:21 IST)

జగన్ బాహుబలి, గౌతం సైరా నరసింహారెడ్డి, చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ: రోజా

ఎపిఐఐసి అధ్యక్షురాలిగా అవకాశం వచ్చిన తరువాత రోజా తన పనితీరును మరింత వేగవంతం చేస్తున్నారు. ఒకవైపు తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడుతూ మరోవైపు ఎపిలో నూతన పరిశ్రమల కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఎపిలో కొత్త పరిశ్రమలు ఎవరూ పెట్టడం లేదని... ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రోజా నెల్లూరులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
జగన్మోహన్ రెడ్డి బాహుబలి, గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి. ఖచ్చితంగా వీరిద్దరు కలిసి ఎపికి కొత్త పరిశ్రమలను తీసుకొస్తారు. ఇప్పటికే విదేశీ పర్యటనల్లో ఉన్న జగన్ ఆ పనే చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఎపికి తీసుకొచ్చే ప్రయత్నం దిగ్విజయంగా జగన్ పూర్తి చేస్తారు. జగన్‌కు ఆ సత్తా ఉంది. నాకు తెలుసు. నేను జగనన్నను దగ్గరగా చూశాను కాబట్టి చెబుతున్నాను.
 
నిరుద్యోగులెవరూ అధైర్యపడొద్దు. కష్టపడే తత్వం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్ ఒక్కరే. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ జనాన్ని మోసం చేసిన చంద్రబాబుకు- జగన్‌కు అసలు పోలికే లేదు. కొత్త పరిశ్రమలు వస్తాయి. కావాల్సినన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు రోజా.