ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (14:18 IST)

ఉప ముఖ్యమంత్రి పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తి?

pawan kalyan
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. ఆయనతో అక్కడ పలు ప్రముఖులు సమావేశమయ్యారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఆప్యాయత ఆలింగనం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.
 
ఇక.. మీడియా ప్రతినిధులు అయితే పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు పోటీపడ్డారు. వారిలో ఇండియా టుడే పవన్ కల్యాణ్ ను పదవులపై ప్రశ్నించింది. అక్కడ పవర్ స్టార్ వారికి ఏదో చెప్పారు కానీ స్పష్టంగా వినబడలేదు. ఐతే... పవన్ కల్యాణ్ తనకు ఉపముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి వున్నట్లు తమతో చెప్పారంటూ ఇండియా టుడే ఛానల్ ప్రసారం చేస్తోంది. మరి అసలు విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.