ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 జూన్ 2024 (20:24 IST)

రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan paid tribute to Ramoji Rao mortal remains
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పార్థివ దేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు శ్రీ కిరణ్, శ్రీమతి శైలజా కిరణ్, శ్రీమతి విజయేశ్వరిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత ఆయనను వచ్చి కలుసుకుందామని అనుకున్నట్లు చెప్పారు.
 
ఐతే ఇంతలోనే ఈ విషాదం జరిగిందని అన్నారు. ఆయనను క్షోభకు గురి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ వెంట శ్రీ రామోజీ రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత శ్రీ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) వున్నారు.